AP: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వంగాయగూడెం వద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుస్మిత ఫర్నీచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా, ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు తెలియరాలేదు.