పీజీ మహిళా హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్‌లో ఉన్న సుధామ పీజీ మహిళా హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్