TG: హైదరాబాద్ మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సులో గాయత్రినగర్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 2 గంటల సమయంలో ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Video Credit: PTI