భారత్-న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్లో యువ క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తెలుగులో మాట్లాడుకున్న సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ సమయంలో తిలక్.. “నువ్వు కాల్ ఇవ్వలేదు” అని అనగా, నితీశ్ “నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా.. ఆరాంసే” అంటూ బదులిచ్చాడు. దీంతో తిలక్ “రేయ్.. రెండు అని చెప్పురా పోనీ” అంటూ సరదాగా మాట్లాడాడు. మైదానంలో వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ కెమెరాల్లో రికార్డు కావడంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆటలో నిమగ్నమై ఉన్నప్పటికీ యువ ఆటగాళ్లు సరదాగా మాట్లాడుకోవడం నెటిజన్లను నవ్విస్తోంది.