మకరజ్యోతి దర్శనం.. శబరిమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు

మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజు ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్