విమానాశ్రయంలో మలేరియా కలకలం.. ఉద్యోగి మృతి

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో మలేరియా వ్యాప్తి కలకలం రేపింది. దోమల ద్వారా వ్యాపించిన ఈ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆరుగురు విమానాశ్రయ ఉద్యోగులు ప్రభావితమయ్యారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. విమానంలో వచ్చిన దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయంలో దోమలను నియంత్రించడానికి ప్రత్యేక ఉచ్చులు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕