మలేరియా వ్యాక్సిన్ ‘మాస్కివాక్’ ధరను దాదాపు 40 శాతం తగ్గిస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ప్రకటించింది. గావి, యూనిసెఫ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో డోసు ధర 5.50 యూరోలకు (సుమారు రూ.585) తగ్గనుంది. ఈ ధర 2027 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. 2027–2029 మధ్య అంతర్జాతీయ టీకా కార్యక్రమాలకు సుమారు 50 మిలియన్ డాలర్లు ఆదా కానుండగా, అదనంగా 10 లక్షల మంది చిన్నారులకు నాలుగు డోసుల టీకా అందనుంది.