మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ ఉజ్వలన్' ఇప్పుడు తెలుగులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ - రాహుల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అటు థియేటర్లలోనూ, తర్వాత నెట్ఫ్లిక్స్లోనూ మలయాళంలో మాత్రమే విడుదలైంది. ఈ మూవీకి ఉన్న డిమాండ్ కారణంగా మేకర్స్ ఇప్పుడు తెలుగులోనూ విడుదల చేయనున్నారు.