మలేషియాలో అండర్-16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన నేపథ్యంలో, మలేషియా కూడా ఇదే తరహాలో ఆంక్షలు విధించే యోచనలో ఉంది. మలేషియా కమ్యూనికేషన్ల మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ మాట్లాడుతూ, 2026 నాటికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిబంధనలు పెట్టే ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలను తాము అధ్యయనం చేస్తున్నామని, పిల్లల భవిష్యత్తును కాపాడటంలో ప్రభుత్వం, తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్