16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: మలేషియా ప్రభుత్వం

సోషల్ మీడియా నుంచి పిల్లలను రక్షించేందుకు మలేషియా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. 2026 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. సైబర్ బెదిరింపులు, మోసాలు, లైంగిక వేధింపుల వంటి ఆన్‌లైన్ హాని నుంచి యువతను రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల విధానాలను అధ్యయనం చేస్తోంది. జనవరి నుంచి, 80 లక్షల మంది యూజర్లను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్‌లు లైసెన్స్ పొందడం తప్పనిసరి చేశారు.

సంబంధిత పోస్ట్