పురుషుల్లో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తుందంటున్నారు. నిద్రలేమి, ఎక్కువసేపు కూర్చోవడం కూడా సమస్యలను తీవ్రతరం చేస్తాయంటున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం వంటివి సహాయపడతాయని సూచించారు.