కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో శనివారం సమావేశమయ్యారు. తమ యువత ఉద్యమాలకు మద్దతు తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. నీట్ పేపర్ లీకేజీపై జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసనకు, పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా అరెస్టైన సమయంలోనూ మమత అండగా నిలిచారని గుర్తుచేశారు. ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహించే ర్యాలీకి సంఘీభావం ప్రకటించిన దిప్కే.. సీజేపీ స్వతంత్ర, తటస్థ సంస్థగా కొనసాగాలనే ఉద్దేశంతో ర్యాలీలో నేరుగా పాల్గొనబోదని స్పష్టం చేశారు.