మాల్దా జిల్లాలో 'సర్ (SIR)' విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనపై తనకు తెలియదని, ప్రస్తుతం బెంగాల్ పాలన తన చేతుల్లో లేదని ఆమె అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్బంధం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారుల నిర్బంధానికి బాధ్యులెవరో తనకు తెలియదని, శాంతిభద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తోందని, వారంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట వింటున్నారని మమత ఆరోపించారు.