స్నేహితుడిని చంపి ఇటుకల కింద శవాన్ని దాచిన వ్యక్తి అరెస్ట్

ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన హత్య కేసులో పోలీసులు 27 ఏళ్ల షిఫాయత్‌ను గురువారం అరెస్ట్ చేశారు. గంజాయి సేవిస్తున్నప్పుడు స్నేహితుడు అజారుద్దీన్ (40) చెంపదెబ్బ కొట్టినందుకు ప్రతీకారంగా.. అతడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. జూన్ 5న జరిగిన గొడవలో అజారుద్దీన్ కిందపడి గాయపడగా, షిఫాయత్ రాళ్లతో దాడి చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇటుకలతో కప్పి పరారయ్యాడు. జూన్ 8న అజారుద్దీన్ మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్