సింగర్ మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వైరల్ అయిన 'బాయిలోనే బల్లి పలికే' పాటపై అవమానకరంగా, కులదూషణకు దారితీసేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేసిన నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, షెడ్యూల్డ్ తెగలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.