దెయ్యం పట్టిందని విమానంలోని ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం.. వ్యక్తి అరెస్ట్

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహమ్మద్ అద్నాన్ అనే వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు. సిబ్బంది అప్రమత్తం చేయడంతో పైలట్ ల్యాండింగ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. అద్నాన్‌ను అదుపులోకి తీసుకొని CISF అధికారులకు అప్పగించారు. తాను దెయ్యం పట్టడం వల్లే అలా చేశానని, హ్యాండిల్ ఎమర్జెన్సీ డోర్‌కు సంబంధించినదని తెలియదని అద్నాన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్