TG: HYD కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ధర్మారెడ్డి కాలనీలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. హాస్టళ్ల వద్ద వరప్రసాద్ అనే వ్యక్తి కోసం ముగ్గురు వ్యక్తులు గాలించారు. అయితే తానే గాలి వరప్రసాద్ అంటూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. అతడిపై ముగ్గురు అకస్మాత్తుగా దాడి చేశారు. అయితే తన భార్యను వేధిస్తున్న వ్యక్తి అనుకుని పొరపాటుగా మరో వరప్రసాద్‌పై ఆమె భర్త, అతడి స్నేహితులు దాడి చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.