కర్ణాటకలోని బీదర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహారాష్ట్రకు చెందిన విష్ణు(27) బీదర్‌లోని చింతకి గ్రామంలో నివసిస్తున్నాడు. పెళ్లై, పిల్లలున్న పూజతో అతడికి ఎఫైర్ ఉంది. కొద్దిరోజుల క్రితం పూజా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమెను కలిసేందుకు విష్ణు అక్టోబర్ 21న ఆ గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో విష్ణును గుర్తించిన పూజ తండ్రి, ఆమె సోదరుడు అతడిని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.