ట్రైన్‌లో అధిక ధరలకు అమ్మడంపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై ఫుడ్ వెండర్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద అండమాన్ ఎక్స్ప్రెస్‌లో నిహాల్ అనే యువకుడు ₹110 విలువైన వెజ్ థాలీ ఆర్డర్ చేయగా, వెండర్ ₹130 అడిగాడు. దీనిపై యువకుడు వివరణ కోరడంతో వెండర్ బెల్టుతో దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టాడట. సంఘటన సమయంలో రైల్వే సిబ్బంది అక్కడే ఉన్నా అడ్డుకోలేదని సమాచారం. అక్టోబర్ 25న జరిగిన ఈ ఘటన జరగ్గా.. అధికారులు విచారణకు ఆదేశించారు.