కొట్టినా చావడం లేదని.. పామును నోటితో కొరికిన వ్యక్తి (వీడియో)

TG: జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని రైల్వే స్టేషన్ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సబ్‌స్టేషన్‌లో పాము కనిపించడంతో సిబ్బంది పాములు పట్టే వ్యక్తి రాముడుకు సమాచారం ఇచ్చారు. రాముడు తక్షణమే చేరుకుని పామును పట్టుకున్నాడు. అయితే ఎంత కొట్టినా చనిపోకపోవడంతో అతడు పామును నోటితోనే రెండు, మూడుసార్లు కొరికేసి పక్కకు పడేశాడు. ఆ పాములో విషం లేదని రాముడు తెలిపాడు. అతనికి ఎలాంటి హాని జరగలేదు.

సంబంధిత పోస్ట్