హైదరాబాద్ పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్నుమ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రూ.200 కోసం ముక్రం అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. మహ్మద్ అజీమ్, అతని స్నేహితులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.