అంకుశాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు అంకుశాపూర్‌కు చెందిన మొగిలిగా గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మొగిలి శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్