TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పహడీ షరీఫ్ ప్రాంతంలో నమెద్ అమీర్ అనే రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.