AP: కాకినాడ జిల్లాలోని హత్యప్రత్తిపాడు (M) టీ. రాయవరంలో ఒక దారుణ హత్య జరిగింది. టీ. రాయవరం మరియు ఏలూరు మధ్యలో ఉన్న ఒక చేపల చెరువు యజమానిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు మరియు నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.