చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామంలో మొహరం ఉత్సవాలకు వెళ్లి,వస్తున్న కర్రోళ్ల యాదయ్య(45)ను గుర్తుతెలియని వ్యక్తులు దారి కాచి కత్తులతో విచక్షణారహితంగా హత్య చేశారు. ఈ ఘటనలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడు గతంలో క్షుద్ర పూజలు చేసేవాడని, అందుకే హత్య జరిగిందని ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్