ఏసీ పేలి వ్యక్తి సజీవ దహనం (వీడియో)

AP: అనకాపల్లిలోని లక్ష్మిదేవి పేటలో ఘోర ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏపీ పేలడంతో వ్యక్తి మృతి చెందారు. రేబాక రామారావు (75) తన గదిలో ఏసీ ఆన్ చేసి పడుకోగా అర్ధరాత్రి అది పేలి మంటలు చెలరేగాయి. శబ్దం విని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో రామారావు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్