తిరుపతి జిల్లా బాలాయపల్లి వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.