TG: పీర్ల పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నాగల్‌గిద్ద మండలం కారముంగిలో మొహర్రం పండుగ వేడుకల్లో మల్లప్ప(47) పాల్గొన్నాడు. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.