భార్యతో గొడవ.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

AP: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలోని పెదజాలరిపేటలో చోటుచేసుకుంది. బాపూజీనగర్‌కు చెందిన జిత్తాడ సతీశ్ శనివారం అర్ధరాత్రి భార్యతో గొడవ పడి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు పగలగొట్టి చూశారు. సతీశ్ ఉరేసుకుని కనించారు. స్థానికుల సహాయంతో సతీశ్‌ను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సతీశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕