సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఇటీవల విషాద ఘటన జరిగింది. ఓ 40 వ్యక్తి అకస్మాత్తుగా రన్నింగ్ ట్రైన్ ముందుకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు వస్తుండగా దాని ముందుకు దూకాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్షణికావేశానికి లోనై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.