AP: అన్నమయ్య జిల్లా, రాజంపేటలోని BSNL ఆఫీసు సమీపంలో విషాదం చోటు చేసుకుంది. యేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి (39) అనే వ్యక్తి గురువారం రాత్రి విషం తాగి, ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు ముందు సెల్ఫీ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. మృతుడు నంద్యాల జిల్లాలోని చిన్నవంగలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.