భార్య, ఆమె బాయ్‌‌ఫ్రెండ్ కారణంగా వ్యక్తి ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్ల రాహుల్ మిశ్రా అనే యువకుడు తన భార్య మోసం, ప్రియుడితో సంబంధం ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం లోహతా ప్రాంతంలోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. తన బిడ్డను దూరం చేయడమే కాకుండా, భార్య వ్యవహారంతో మనస్తాపం చెందిన రాహుల్, తన బాధను 7 నిమిషాల వీడియోలో రికార్డ్ చేసి, ఆత్మహత్యకు ముందు తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కానీ వేరే మార్గం లేదని చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

సంబంధిత పోస్ట్