రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి (వీడియో)

తమిళనాడులోని కడలూరు జిల్లా గోండూరు ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన జరిగింది. మధురైకి చెందిన కణ్ణన్ అనే వ్యక్తి స్థానికంగా నివసిస్తున్నాడు. హోటల్‌లో ఆహారం కొనుక్కుని రోడ్డు దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ కణ్ణన్‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సంఘటనా స్థలంలోనే కణ్ణన్ ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్