AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ సమీపంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద వర్షం కారణంగా సరిగ్గా కనిపించకపోవడంతో యూటర్న్ తీసుకుంటున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఆశమ్ అంకిరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రాంతంలో మరో రెండు లారీలు పరస్పరం ఢీకొనగా, ఒక డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.