టాయిలెట్‌కి వెళ్లి 18వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

ముంబయి వడాలాలో దారుణం చోటు చేసుకుంది. 18వ అంతస్తు షాఫ్ట్‌ అంచున మల విసర్జనకు కూర్చున్న ఓ వ్యక్తి (52) అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. విరేచనాలతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోని టాయిలెట్‌లో మరొకరు ఉండటంతో అతను భవనం షాఫ్ట్‌ అంచుకు వెళ్లి మల విసర్జనకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే అదుపుతప్పి కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్