ఫ్లైఓవర్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

TG: ఫ్లైఓవర్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలోని అంబర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాచిగూడ నుంచి అంబర్‌పేట్‌ వైపునకు ఫ్లైఓవర్ పైనుంచి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఛే నంబర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఫ్లైఓవర్ రేయిలింగ్‌ను ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్