TG: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామం నుంచి పూడూరు వెళ్లే మార్గంలో వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రవల్లి (M) దువ్వాసిపల్లి గ్రామానికి చెందిన వడ్డే పరుశరాముడు తండ్రి హుసేన్ గత రెండు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం పక్కన మద్యం బాటిల్ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.