మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని ఔంధ్ ప్రాంతంలో జులై 30వ తేదీన స్కూటీపై వెళ్తున్న జగన్నాథ్ కాలే (61) అనే వ్యక్తి ఓ కారును ఓవర్‌టెక్ చేస్తున్న క్రమంలో రోడ్డుపై గుంత కారణంగా అదుపుతప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన కారు అతడి తలపై నుంచి దూసుకెళ్లింది. జగన్నాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.