యువతికి బలవంతంగా ముద్దు పెట్టి పారిపోయాడు (వీడియో)

యూపీలోని బిజ్నోర్‌లో ఈ నెల 14న షాకింగ్ ఘటన జరిగింది. నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ యువతి ఇరుకైన వీధి గుండా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక యువకుడు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చాడు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి బలవంతంగా ముద్దు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే పోలీసులు స్పందించారు. నిందితుడిని గుర్తించామని, అతడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్