హైదరాబాద్ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడువేల రూపాయల లోన్ కట్టాలని లేదంటే కుటుంబం మొత్తం నగ్న ఫొటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించడంతో ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భార్య నాగవేణి తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చని, లోన్లకు డబ్బులు చెల్లిస్తే ఇబ్బందులు పెరుగుతాయని ఆమె చెప్పినా, ప్రేమ్‌కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.