మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆష్టి ప్రాంతంలో పులి దాడికి పాల్పడటంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పశువుల మేత కోసం అడవి ప్రాంతానికి వెళ్లిన సదరు వ్యక్తిపై పులి అకస్మాత్తుగా దాడి చేసింది. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అడవికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు.