ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

బెంగళూరులోని రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన లలిత (49) అనే మహిళను ఆమె ప్రియుడు లక్ష్మీనారాయణ (51) హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ ఎనిమిది నెలలుగా బెంగళూరులో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, మద్యం సేవించి గొడవపడిన తర్వాత ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. లలితకు వివాహమై పిల్లలు ఉన్నారని, కుటుంబానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్నారని సమాచారం. లక్ష్మీనారాయణ కూడా ఇలాంటి కుటుంబ పరిస్థితుల్లోనే ఉన్నారని తెలిసింది.

సంబంధిత పోస్ట్