ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య బురఖా ధరించలేదని మహమ్మద్ ఫరూఖ్ అనే వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు మైనర్ కూతుర్లను కాల్చి చంపాడు. అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే 9 అడుగుల లోతు గొయ్యిలో పూడ్చిపెట్టాడు. అయితే ఇటీవల డబ్బు విషయంలో భార్యతో గొడవపడి, బురఖా ధరించకుండా పిల్లలతో పుట్టింటికి వెళ్లిన ఆమెను అవమానంగా భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.