ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యతో విడాకులు వస్తే దేవుడికి సాష్టాంగ నమస్కారాలు చేస్తానని మొక్కుకున్న యువకుడు, కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత ఏకంగా 9 కిలోమీటర్ల దండవత్ యాత్ర చేశాడు. నవరాత్రి సందర్భంగా ఉపవాసంతో ప్రారంభించి, సుమారు 12 గంటల పాటు నేలపై సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నాడు. మోకాళ్లు గాయపడినా ఆగకుండా యాత్ర పూర్తి చేశాడు. చివరగా ఆలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.