మహారాష్ట్ర పర్భానీలోని గంగాఖేడ్ నాకా ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మైనా కాలేను ఆమె భర్త కుందాలిక్ నిత్యం తిట్టడం, కొట్టడం చేసేవాడు. మూడవసారి కూడా ఆడపిల్లే పుట్టిందని కోపంతో రగిలిపోయిన కాలే.. గురువారం రాత్రి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన మైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో కుందాలిక్ కాలేను పోలీసులు అరెస్టు చేశారు.