AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీధి కుక్కల వెంబడించడంతో ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందారు. లక్ష్మీపురం చెందిన ఫజిల్ (42) రాత్రి 3 గంటలకు బైక్‌పై ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంటపడ్డాయి. భయంతో వేగం పెంచిన ఫజిల్ వాహనం అదుపుతప్పి ఆలయ గోడను ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.