ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో దారుణం జరిగింది. మంగళవారం రాత్రి ఇంట్లో పూజ జరుగుతుండగా పూజారులు ఉండటం ఇష్టం లేక అరవింద్ సింగ్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తన భార్య బబితతో పాటు ఇద్దరు పూజారులను కాల్చి చంపాడు. అనంతరం ముగ్గురు పిల్లలను గదిలో బందీలుగా ఉంచి సుమారు 8 గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో 10 ఏళ్ల కుమారుడిపై కాల్పులు జరపడంతో బాలుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా జరిపిన ఎదురుకాల్పుల్లో అరవింద్ సింగ్ మృతిచెందాడు. ఇద్దరు కుమార్తెలను పోలీసులు సురక్షితంగా రక్షించారు.