భార్యపై అనుమానంతో.. కుమార్తె గొంతు కోసిన వ్యక్తి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన జరిగింది. హనుమంత్ సోనావాలే అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. భార్య రాజశ్రీకి వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకుని తరచుగా ఆమెను కొట్టేవాడు. దీంతో భర్త హింసను భరించలేని రాజశ్రీ విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేసింది. ఇది తెలిసి హనుమంత్ భార్యతో గొడవపడ్డాడు. గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న 14 ఏళ్ల కుమార్తె గొంతును బ్లేడ్‌తో కోశాడు. భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై కూడా బ్లేడ్‌తో దాడి చేశాడు. దీంతో రాజశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్