ఉత్తరప్రదేశ్ బల్లియాలో అమిత్ గౌడ్ అనే వ్యక్తి తన అత్తవారింట్లో బీభత్సం సృష్టించాడు. తన భార్య ప్రీతి (23), అత్త కౌసల్య (50)ల గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న తన కుమారుడిని పక్కకు విసిరేసి, తన మరదలిని కూడా గొంతు నులిమి చంపాడు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగిన ఈ దంపతుల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగింది. ప్రీతి తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోందని పోలీసులు వెల్లడించారు.