బెంగళూరులోని గంగమ్మ లేఅవుట్‌లో దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త తన భార్యను గొంతు కోసి చంపాడు. అంజలి (20) ను రవిచంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు. రవి బస్సు డ్రైవర్‌గా చేస్తూ.. వారంలో ఒకసారి ఇంటికొస్తాడు. ఈ క్రమంలో రవీంద్ర గురువారం ఇంటికి వచ్చినపుడు భార్య లేకపోవడంతో అనుమానం మొదలైంది. ఆమె ఇంటికొచ్చి నిద్రపోయిన తర్వాత కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.